- జోరుగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతు తెలుపుతున్న కాలనీల వాసులు
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి వి.జగదీశ్వర్ గౌడ్ కి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గంగారాం గ్రామంలో కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, రాజు ముదిరాజ్, యుగేందర్, శ్రీనివాస్, దొంతి రాజు ముదిరాజ్, అంజయ్య, రాధ కృష్ణ గౌడ్, భిక్షపతి, దేవరాజ్, ప్రవీణ్ కుమార్, కంది చిన్న, అనిల్, సాయి కిరణ్, వంశీ, పాండు, రాజు, మహేష్, నందు, మాణిక్ రాజు, సత్యం, గోపాల్, నితిన్ గౌడ్, భాస్కర్, ప్రకాష్, నిరంజన్, బిమమ్మా, సుమలత, శివుని, శిరీష పాల్గొన్నారు.