నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళాకృతి నృత్యాలయ గురువు భారతి శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
పుష్పాంజలి, ఆనంద నర్తన గణపతిమ్, మామవతు, కట్టెదుర వైకుంఠం, పలుకే బంగారమయేహ్న, ఒకపరి కొకపరి, దుర్గే దుర్గే, చిన్ని శిశువు, దేవర్ణమా, డోలాయాం, షణ్ముఖ కౌతం, తోదయమంగళం మొదలైన అంశాలను కళాకారులు విష్ణుప్రియ, తనిష్క, అధిత్రి, శ్రీనయన, సహస్ర, సంజన మొదలైనవారు ప్రదర్శించి మెప్పించారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ 8వ బాటలిన్ పోలీస్ బ్యాండ్ ప్రదర్శించారు. ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.