అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి: ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ యశోద పెరల్ వద్ద జరుగుతున్న నాల విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ నాల విస్తరణ లో భాగంగా మిగిలిపోయిన అసంపూర్తి పనులను వేగవంతం చేయాలని, రామకృష్ణ నగర్ లోని యశోద పెరల్ వద్ద, అదేవిధంగా సత్యనారాయణ ఎనక్లేవ్ వద్ద నాల విస్తరణ పనులను వేగవంతం చేయాలనీ అధికారుల‌కు సూచించారు. వరద నీరు ప్రవహించే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అన్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలతో చెరువుల మధ్యలో ఉన్న నాళాల ద్వారా ఒక చెరువు నుండి మరొక చెరువుకు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అవరోధాలు లేకుండా నాళాలను అభివృద్ధి చేసే ప్రత్యేక ప్రణాళిక‌తో ముందుకు సాగుతున్న‌ట్టు తెలిపారు. ఎన్నో రోజుల నుండి చేపడుతున్న అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేసి ఆయా నాలాల‌ను పూర్తి స్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చిన్నా రెడ్డి, ఈఈ శంకర్, డీఈ రూపదేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్ట‌ర్‌ జగదీష్, నాయ‌కులు వాలా హరీష్ రావు, కాలనీ వాసులు లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

నాలా ప‌నుల తీరును ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీకి వివరిస్తున్న‌ ఎస్‌ఈ చిన్నారెడ్డి, ఈఈ శంక‌ర్‌, డీఈ రూపాదేవి, ఏఈ అనురాగ్‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here