నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలా అమలుకు శ్రీకారం చుట్టింది.

ఈ సందర్బంగా హఫీజ్ పేట్ 106 డివిజన్ లోని అన్ని ప్రాంతాలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయగా.. టిపిసిసి సమన్వయకర్త సామ్యూల్ కార్తీక్ రాజీవ్ గృహకల్ఫలోని దరఖాస్తు కేంద్రాన్ని సందర్శించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దరఖాస్తులు నింపడంలో చేయూత అందించారు. కార్యక్రమంలో డివిజన్ విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు.