- డీసీ వంశీ కృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతి కార్తీక్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీ సమస్యపై ఫిర్యాదు చేసిన సమస్యను పరిష్కరించడం పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొంతి కార్తీక్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు.
వివరాలు.. చందానగర్ డివిజన్ వేముకుంట వేణుగోపాలస్వామి ఆలయం మసీద్ రహదారిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య ఏర్పడగా అధికారులు సీసీ రోడ్డు తవ్వి పైపులైన్ వేసి మళ్లీ రోడ్డు వేయకుండా వదిలేశారని, అనంతరం అదే మట్టితో ఆ గుంతను పూడ్చివేయడంతో ఆ రహదారి గుండా వెళ్లే వాహనదారులు, ప్రజలు, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని చందానగర్ సర్కిల్ 21 కార్యాలయంలో డీసీ వంశీ కృష్ణకు దొంతి కార్తీక్ గౌడ్ శనివారం వినతి పత్రం సమర్పించారు.
తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.