అడుగడుగునా ఘన స్వాగతం

  • తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా.. దారిపొడవునా బోనమెత్తిన మహిళలు
  • ఆకట్టుకున్న డప్పు కళాకారుల విన్యాసాలు, భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణలు
  • రాహుల్ గాంధీకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జెరిపేటి జైపాల్, రామ్ చందర్ రాజు
మియాపూర్ బొల్లారం చౌరస్తాలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలికిన అనంతరం ఆయనతో పాటు పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జెరిపేటి జైపాల్

నమస్తే శేరిలింగంపల్లి : దేశ సమైక్యత, సమగ్రత నినాదమే లక్ష్యంగా బరిలో దిగి అడుగడుగునా జనాదరణ పొందుతున్నారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ. దేశ ప్రజలను ఏకం చేసి ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టేందుకు చేపట్టిన భారత్‌ జోడోయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం శేరిలింగంపల్లిలో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టింది. ఈ సందర్బంగా అడుగడుగునా భారీ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా దారిపొడవునా బోనమెత్తిన మహిళలు.. డప్పు కళాకారుల విన్యాసాలు, భారత మాత, జాతిపిత గాంధీ వేషధారణల నడుమ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జెరిపేటి జైపాల్, రామ్ చందర్ రాజు ఆధ్వర్యంలో మియాపూర్ బొల్లారం చౌరస్తాలో రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. మియాపూర్ నుండి అల్విన్ కాలనీ వరకు విద్యార్థులు జాతీయ జెండాలతో గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. అల్వీన్ కాలనీ చౌరస్తా సమీపంలో రాహుల్ గాంధీ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మదీనగూడ లోని కినారా గ్రాండ్ హోటల్ లో అల్పాహార విందు చేసి స్థానిక నాయకులతో మంతనాలు జరిపారు. హోటల్లో 4 గంటల విరామం అనంతరం కార్ లో బీహెచ్ఈయల్ చౌరస్థాకు వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి నుండి పటాన్ చెరువు యాత్రగా బయలు దేరి వెళ్లారు. అంతకుముందు దీప్తిశ్రీ నగర్ చేరుకున్న రాహుల్ గాంధీని బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ కూతురు, సినీ నిర్మాత పూజాభట్ కలిసి మాట్లాడారు.

మియాపూర్ వద్ద రాహుల్ గాంధీకి జాతీయ జెండాలతో స్వాగతం పలుకుతున్న విద్యార్థులు
దారిపొడవునా నెత్తిన బోనంతో స్వాగతం పలికిన మహిళలు

మియాపూర్ బొల్లారం చౌరస్తాలో డప్పు కళాకారుల విన్యాసాలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here