నమస్తే శేరిలింగంపల్లి : బిజేపి పార్టీ రాహుల్ గాంధీని రావణుడుతో పోల్చుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేసినందు కు నిరసనగా బిజేపి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడి చేశారు.
ఈ ముట్టడి కార్యక్రమంలో రవికాంత్ గౌడ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కార్తిక్ కుమార్ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ, సాము వరుణ్ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ, కప్పెర దుర్గేష్ శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, దొంతి సాయి కిషోర్ శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సామ్యూల్, శ్రీకాంత్, రాజు, మహేందర్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.