- బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్`
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, రాజీవ్ గృహకల్ప, తారనగర్ వివిధ కాలనీలలో ఇంటింటికి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తూ ప్రజా శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం పాటుపడుతోందని కార్పొరేటర్ గారు స్పష్టం చేశారు.
శేరిలింగంపల్లి డివిజన్ లోని గోపినగర్, రాజీవ్ గృహకల్ప, తారనగర్ వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై మొదటి విడత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు, అక్క, చెల్లెళ్లకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ పెన్షన్ ఆఫీసర్ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డు మెంబర్స్ శ్రీకళ, కవిత గోపి, దీవెన, గోపాల్ యాదవ్, చంద్రకళ, భాగ్య లక్ష్మి, సుధారాణి, కుమారి, కళ్యాణి, రాములమ్మ, జయమ్మ, సుగుణ, మేరీ, హంసమ్మ, సుబ్బమ్మ, జ్యోతి, రాజేశ్వరి, రజిని, సంగీత పాల్గొన్నారు.