– ప్రభుత్వ విప్ గాంధీకి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు వినతి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ లోని వీకర్ సెక్షన్ కాలనీల వాసులకు గుర్తింపు పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీకి గురువారం వినతి పత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని పొగుల ఆగయ్య నగర్, శివాజీ వీకర్ సెక్షన్, ఇందిరానగర్, గంగారాం హరిజన బస్తి, వేముకుంట, జవాహర్ నగర్ వీకర్ సెక్షన్, కైలాశనగర్ వీకర్ సెక్షన్, వేమనకానీ వీకర్ సెక్షన్, భవనిపురం వీకర్ సెక్షన్ లాంటి బస్తీల్లో గత 30 సంవత్సరాలనుండి నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్న నిరుపేదలకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరుచుకుని గుర్తుంపు లేకుండా ఉన్నవారికి ముఖ్యమంత్రి పాస్‌బుక్‌లు ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో చందానగర్ నిరుపేదలకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన విప్ గాంధీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో రాఘవరావుతో పాటు మాజీ కౌన్సిలర్లు రవిందర్‌రావు, సోమ్‌దాస్‌లు ఉన్నారు.