రాహుల్ గాంధీ అరెస్టు అప్రజాస్వామికం: ఎం.రవికుమార్ యాదవ్

మనీషా మృతికి కొవ్వొతులతో సంతాపం తెలుపుతున్న రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు

చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రవికుమార్ యాదవ్ అన్నారు. అత్యాచార బాధితురాలు మనీషా మృతికి సంతాపంగా చందానగర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసులో బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.

మనీషా కేసులో న్యాయం జరగాలని కోరుతూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పిస్తున్న దృశ్యం

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, రోజూ మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆరోపించారు. మనీషా హత్య జరిగిన అనంతరం కుటుంబసభ్యులకు తెలియకుండానే మృతదేహానికి దహన సంస్కారాలు చేయడం దారుణమని తెలిపారు. బాధిత కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించడానికి కూడా అవకాశం లేకుండా అరెస్టులు చేయడం చూస్తుంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా సందేహం తలెత్తుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మహిళలపై జరుగుతున్న దాడులు అంతమవుతాయన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కి మైనారిటీ ఓట్ల పై ఉన్న ప్రేమ కాస్తయినా మహిళల రక్షణ పై ఉంటే మహిళలకు న్యాయం జరిగేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలకు మహిళలే తగిన బుద్ధి చెబుతారని, అత్యాచార ఘటనలో ప్రభుత్వం తీరును కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో రఘునందన్ రెడ్డి, ఎల్లేష్, రమేష్, ఇలియాస్ షరీఫ్, సీతారామరాజు, రాధాకృష్ణ యాదవ్, మహిపాల్ యాదవ్, శేఖర్ రెడ్డి, ఖాన్ సాప్, హబీబ్ జానీ, రాజు గౌడ్, భారత్, రాజన్, నరసింహ, మల్లేష్ గౌడ్, శ్రీహరి గౌడ్, అర్జున్, హరి విజయ్, అఖిల్, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here