- నీటిలో ఆగిన ఆర్టీసీ బస్సు
- లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శుక్రవారం రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ వెంటనే స్పందించి అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిన వర్షపు నీటిని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి సిబ్బంది సహకారంతో తొలగింప జేయించారు. అంతేకాక వర్షపు నీటిలో నిలిచిన ఆర్ టీ సి బస్సును తొలగించి ట్రాఫిక్ సమస్య, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, గోపాల్ యాదవ్, శ్యామ్ ఉన్నారు.