- సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ అందజేత
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీకి చెందిన ప్రభుదాస్ అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ ఎఫ్ నుంచి రూ . 1 లక్ష మంజూరయ్యాయి. ఈ ఆర్ధిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ ఎఫ్ ఎల్వోసీ మంజూరి పత్రాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, నిరుపేదలకు , అభాగ్యులకు అండగా ఉంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నది చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విఠల్ , మధు, రాము, రాధ బాయి పాల్గొన్నారు.