- పరిశీలించిన టి.పి.సి.సి ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కురిసిన వర్షానికి లింగంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి నీట మునిగింది. నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జేరిపేటి జైపాల్ ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల రవాణా, ట్రాఫిక్ సౌకర్యార్థం నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జి ని స్థానిక శాసనసభ్యులు. అధికారుల నిర్వహణ లోపం వల్ల సాధారణ రోజులో కూడా నిత్యం నీరు నిలవడం, ప్రయాణికులు ఇబ్బందులు పడటం పరిపాటిగా జరుగుతున్నదని తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌదర్యం రాజన్, స్థానిక డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ శామ్యూల్ కార్తీక్, మైనారిటీ చైర్మన్ జహంగీర్, రాష్ట్ర సోషల్ మీడియా కోర్డినేటర్ కవిరాజ్, సీనియర్ నాయకులు పోచయ్య, శేఖర్, సూర్య రాథోడ్ పాల్గొన్నారు.