నమస్తే శేరిలింగంపల్లి : నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్, రామయ్య నగర్, తారనగర్, ఆరంభ టౌన్షిప్, ఆదర్శ్ నగర్, అనంతరం శివాజీ నగర్ వివిధ కాలనీలలో గణేష్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గణేష్ మండపాలలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆయా మండపాల్లోని గణనాధులకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కార్పొరేటర్ ని శాలువాతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని విగ్నేశ్వర మండపం పరిధిలోని భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ప్రతిఒక్కరూ సంపదలతో విరజిల్లాలని ఆకాంక్షించారు.
ఆ గణనాధుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని లంబోదరుడిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ సోమ దాస్, సీనియర్ నాయకులు రాఘవరావు, సత్యనారాయణ, రవీందర్ రావు, శ్రీనివాస్ రాజ్ ముదిరాజ్, నరేందర్, నామాల అశోక్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, ఆయా కాలని ప్రెసిడెంట్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక వాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.