నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని వెంకట్ రెడ్డి కాలనీలో నూతనంగా చేపడుతున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన డ్రైనేజీ పనులను పూర్తి చేసి, సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.
సీసీ రోడ్డు వేసేటపుడు సక్రమంగా క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు. అనంతరం చాలా రోజుల నుండి లింగంపల్లి చుట్టుపక్క పరిసర ప్రాంతాల వాసులకు ఇబ్బందికరంగా మారిన నాలా శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ. కోటి రూపాయల పైచిలుకు వ్యయంతో చేపడుతున్న నాలా కల్వర్ట్ పనులను పరిశీలించి, లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నుండి వస్తున్న వరద నీటి వలన లింగంపల్లి, వెంకట్ రెడ్డి కాలనీ పరిసర ప్రాంతాలలో వరద నీరు ఇళ్లల్లోకి వస్తున్న తరుణంలో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కల్వర్టు పనులను చేపట్టి పూర్తిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, జయంత్ కుమార్ సర్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, అశోక్, రమణ గౌడ్, మధు గౌడ్, అజర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.