నమస్తే శేరిలింగపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్ కి చెందిన భవాని ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ నుంచి రూ. 1లక్ష 50వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ మంజూరి పత్రంను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందచేశారు.
అనంతరం మాట్లాడుతూ ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పునరుద్గాటించారు. అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు, బ్రిక్ శ్రీనివాస్, కోనేరు ప్రసాద్, కాశినాథ్ యాదవ్, గుమ్మడి శ్రీనివాస్, ఎల్లం నాయుడు, మల్లేష్, మున్నా, కరణ్ సింగ్ కార్యకర్తలు పాల్గొన్నారు.