శేరిలింగంపల్లి(నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనకు పాటు పడుతున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని గోపినగర్ లో స్థానికులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరకబావి గల్లీలో సీసీ రోడ్డు పనులు వేయనున్న దృష్ట్యా ఇక్కడి ప్రాంత ప్రజలు తమతమ ఇళ్లల నుంచి డ్రైనేజీ పైపులైన్ కలుపుకోవాలని సూచించారు. కాలనీలో కొన్నేళ్లుగా సీసీ రోడ్లు, యూజీడీ, మంచినీటి పైపులైన్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఇక నుంచి ఆ సమస్య ఉండబోదని తెలిపారు. కాగా కాలనీలో కొన్ని ఇళ్లకు మంజీరా మంచినీటి పైపులైన్ పనులు వేయాలని స్థానికులు కోరగా తప్పకుండా వేయించేలా చూస్తానని నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో నాయకులు గఫూర్, ఆంజనేయులు, ఎంఆర్ విజయలక్ష్మి, ప్రభాకర్ గౌడ్, అశోక్ గౌడ్, సైదులు యాదవ్, నర్సింహా, రమేష్ గౌడ్, మల్కమ్మ, వెంకటలక్ష్మీ, ప్రభాకర్, రవి తదితరులు పాల్గొన్నారు.