ఘనంగా రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుద్ యాదవ్ జన్మదినం

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో రాష్ట్ర యువజన నాయకుడు, రాన్స్ ఇన్ఫ్రా కన్స్ స్ట్రక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ రాగం అనిరుద్ యాదవ్ జన్మదిన వేడుకలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో డివిజన్ లోని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, వార్డ్ మెంబర్స్, యువ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అట్టహాసంగా నిర్వహించారు.


బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, వార్డ్ మెంబర్స్, యువ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో రాగం అనిరుద్ యాదవ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి డివిజన్ లోని కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన రాగం అనిరుద్ యాదవ్

ఈ సందర్బంగా రాగం అనిరుద్ యాదవ్ తో కేక్ కట్ చేయించి, శాలువాతో సత్కరించి, పూలబొకేలు అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా రాగం అనిరుద్ యాదవ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, వార్డ్ మెంబర్స్ కవిత గోపాలకృష్ణ, పర్వీన్ బేగం, చంద్రకళ, కనకలక్ష్మి, గడ్డం రవి యాదవ్, బస్వరాజ్, గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, సుభాష్ రాథోడ్, సుధాకర్, డిఎస్ రావు, సాయి, సత్యనారాయణ, నర్సింలు, దివాకర్ రెడ్డి, నీరూప, సుధారాణి, కుమారి, కళ్యాణి, రోజరాణి, జయ, రజిని, దివ్య, సుమన్, సూర్య రాథోడ్, మల్లేష్ యాదవ్, హరీష్, ప్రణయ్, శరణ్, తుకారం, నర్సింహా, దీవెన, గౌసియా పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here