స్థానిక నేరగాళ్లు, అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించాలి: సీపీ స్టీఫెన్

  • ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని సీసీఎస్ శంషాబాద్ జోన్, సిసిఎస్ బాలానగర్ జోన్, సిసిఎస్ మాదాపూర్ జోన్ కు చెందిన పోలీసు సిబ్బంది ఉత్తమ ప్రతిభకు రివార్డులు వరించాయి. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., వారిని అభినందించి ఈ రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సిసిఎస్ పోలీసులు నేర నివారణ, నేర ఛేదనపై దృష్టి సారించాలన్నారు. క్రైమ్ డిటెక్షన్ పై రోజువారి సమీక్షలు చేసుకోవాలన్నారు.

ఉత్తమ ప్రతిభకు కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేస్తున్న సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర,

ఈ సందర్భంగా సిపి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేశారు. సిబ్బంది ముఖ్యంగా స్థానిక నేరగాళ్లు , అంతర్రాష్ట్ర ముఠాలపై దృష్టి సారించాలన్నారు. సిసిఎస్ పోలీస్ సిబ్బంది ఇతర రాష్ట్రాల పోలీస్ పోలీసులతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కానిస్టేబుల్ కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బందితో, ఎస్ఐ ఎస్ఐ ర్యాంకు సిబ్బందితో ఇన్ స్పెక్టర్ ర్యాంకు సిబ్బందితో క్రైమ్ డిటెక్షన్ విషయంలో టచ్ లో ఉండాలి అన్నారు. 2022లో 60 శాతం క్రైమ్ డిటెక్షన్ రేటు ఉందన్నారు. 75 నుంచి 80 శాతనికి క్రైమ్ డిటెక్షన్ రేట్ పెరగాలన్నారు. ఉత్తమ పనితీరును ఇలాగే కొనసాగించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్వింగ్ మొదటి స్థానంలో ఉండాలన్నారు. సిబ్బందికి ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., అడ్మిన్ డిసిపి యోగేష్ గౌతమ్, ఐపీఎస్., ఏడిసిపి క్రైమ్స్ జి. నరసింహారెడ్డి, సిసిఎస్ ఎసిపి కె. శశాంక్ రెడ్డి, సిసిఎస్ ఇన్ స్పెక్టర్ బాలరాజు, సిసిఎస్ మాదాపూర్ ఇన్ స్పెక్టర్ ప్రసన్నకుమార్, సిసిఎస్ శంషాబాద్ ఇన్ స్పెక్టర్ నరసింహ, ఎస్‌ఐలు , ఇతర పోలీసు సిబ్బంది ఉన్నారు.

రివార్డులు అందుకున్న పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బందితో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here