నమస్తే శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నుంచి పలువురు చందానగర్ డివిజన్ బిఆర్ఎస్ మహిళ నాయకురాలు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చకున్నారు.
పార్టీలో చేరిన రామస్వామి, రాజేందర్, ప్రసాద్, సత్యనారాయణ, ఎం.డి హసన్, కుమార్ లకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రజలకు అనేక పథకాలు అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గౌస్ పాల్గొన్నారు.