చలివేంద్రాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి

  • చలి వేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చలివేంద్రాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు రావాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. నగరంలో రోజు రోజుకూ ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలో చలివేంద్రాల ఏర్పాటు బాటసారులు, వాహనదారుల దాహార్తి తీర్చేందుకు దోహద పడుతుందని తెలిపారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మంజీరా రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాత్రి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు.

మంజీరా రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాత్రి గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

అనంతరం చల్లని మజ్జిగను కాలనీ వాసులకు అందచేశారు. చలివేంద్రం ఏర్పాటు  చేసిన నిర్వాహకులు దాత్రి గౌడ్ ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, శేఖర్ గౌడ్, బాబు మోహన్, మల్లేష్, అర్జున్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, ఆశీల శివ, శాస్త్రి, కిషోర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

మజ్జిగ కేంద్రంలో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here