నమస్తే శేరిలింగంపల్లి: ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యాక్సిన్ వేయించుకుని కరోనా నివారణకు పాటుపడాలని మాజీ ఎమ్మల్యే భిక్షపతియాదవ్ అన్నారు. మంగళవారం ఆయన గచ్చిబౌలిలోని హిమగిరి ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా భిక్షపతియాదవ్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతీ పౌరుడు విధిగా వ్యాక్సిన్ చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, తాను వ్యాక్సినేషన్ అనంతరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.






