ఎంసిపిఐయు గ్రేట‌ర్‌ కార్యాల‌యంలో బ‌లిదాన్ దివ‌స్‌

మియాపూర్‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ‌త్యాగం చేసిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల 90వ‌ వ‌ర్ధంతి సందర్భంగా నిర్వ‌హించే బ‌లిదాన్ దివ‌స్ కార్య‌క్ర‌మాన్ని మియాపూర్ లోని ఎంసిపిఐయు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎఐఎఫ్‌డివై రాష్ట్ర క‌మిటీ స‌భ్యులు దైవపూజ మ‌ధు భ‌గ‌త్ సింగ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా చిన్న‌వ‌య‌సులోనే దేశంకోసం పోరాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు నేటి యువ‌త‌కు ఆద‌ర్శ‌ప్రాయుల‌న్నారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఉద్రిక్తం చేసి దేశ ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తి నింపిన భ‌గ‌త్‌సింగ్‌కు భార‌త‌రత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఈ కార్య‌క్ర‌మంలో ఎంసిపిఐయు గ్రేటర్ కార్యదర్శి తుకారాం నాయక్, లావ‌ణ్య‌, డివిజన్ కార్యదర్శి కన్న శ్రీనివాస్, శ్రీను, సుకన్య, శ్రీలత, హమీన బేగం, అనిత, ఇందిరా, లక్ష్మి , పల్లె మురళీ , రవి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

భ‌గ‌త్‌సింగ్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పిస్తున్న ఎంసిపిఐయు నాయ‌కులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here