గ‌చ్చిబౌలి డివిజ‌న్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలని జెడ్‌సికి కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డి విన‌తి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు వినతి పత్రం అందజేశారు. మంగ‌ళ‌వారం జెడ్‌సి కార్యాల‌యంలో ర‌వికిర‌ణ్‌కు క‌లిసిన గంగాధ‌ర‌రెడ్డి డివిజన్ లో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై చర్చించారు. కేశవ్ నగర్ వద్ద ప్రభుత్వ స్థలంలో నివాసం ఉంటున్న స్థానికులకు అధికారులు విద్యుత్ సేవలు నిలిపివేయడంతో గత మూడురోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కేశవ్ నగర్ ప్రాంత ప్రజలకు విద్యుత్ సేవలు పునరుద్ధరించాలని కోరారు. అలాగే గౌలిదొడ్డి పంథాలో వార్డ్ కార్యాలయం నిర్మిచాలని, స్కైప్క్స్ లేక్‌వ్యూ అపార్ట్మెంట్ వద్ద మురుగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. జెడ్‌సిని క‌లిసిన వారిలో బిజెపి నాయ‌కులు త‌దిత‌రులు ఉన్నారు.

జెడ్సి ర‌వికిర‌ణ్‌కు విన‌తిప‌త్రం స‌మ‌ర్పిస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here