- ఇటీవలే ప్రారంభమైన తపాడియా మారుతి మాల్
- తెల్లారుజామున అగ్ని ప్రమాదం
- 5వ అంతస్తు వరకు వ్యాపించిన దట్టమైన పొగలలు
- సకాలంలో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చిన డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది
- భారీ ఆస్తి నష్టం.. ఇంకా వివరాలు తెలియాల్సి ఉందని అధికారుల వెల్లడి
- పరిస్థితిని సమీక్షిస్తున్న జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి కార్తీక్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రమాదవశాత్తు ఓ మాల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన చందానగర్ సమీపంలో చోటు చేసుకున్నది. శనివారం తెల్లారుజామున జాతీయ రహదారికి అనుకొని ఉన్న తపాడియా మారుతిమాల్ లో ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. మొదట ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలు అలుముకొన్నాయి. 5వ అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో మల్టీ ఫ్లెక్స్ సినిమా హాల్ లోని ఐదు స్క్రీన్ లలో మూడింటిలో ధట్టమైన పొగలో అలుముకుంది. వెంటనే డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలు వేరే అంతస్తులోకి వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. మాల్ లో మంటలు ఎందుకు చెలరేగాయో.. షార్ట్ సర్క్యూట్ కారణమా.. ఇంకేదైనా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. భారీ ఆస్తి నష్టం కలిగినట్లు తేలుతున్నది.
ఈ మాల్ ను ఇటీవలే ప్రారంభించగా.. కొన్ని షాప్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అయితే శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి కార్తీక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

