మీ ఆటలు సాగవిక..

  • గజమాల, డప్పు సప్పులతో, బతుకమ్మ కళాకారులతో,
  • ఆర్, కే ,వై టీ సభ్యుల ఘన స్వాగతం
  • చెరువుల తూములు ముస్తూ వెంచర్లు వేస్తూ డబ్బులు సంపాదిస్తున్న బి.ఆర్.ఎస్ నాయకులు
  • మక్తా మహబూబ్ పేట్ గ్రామంలో నిర్వహించిన పాదయాత్ర లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
ప్రజా యాత్రలో…

నమస్తే శేరిలింగంపల్లి: స్థానిక కార్పొరేటర్ పై అనేక కబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయని, అతి త్వరలో అన్నిటినీ భారతీయ జనతా పార్టీ బయటకు తీస్తుందని హెచ్చరిస్తూ మక్త మహబూబ్ పేట్ గ్రామంలో స్థానిక బిజెపి నాయకులతో గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఇంటింటికి తిరిగి అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలను, కబ్జాలను ప్రజలకు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తెలిసే విధంగా కరపత్రాల పంచుతూ పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్బంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దొరికిందల్లా దోచుకోవడం, వచ్చింది దాచుకోవడం బిఆర్ ఎస్ పార్టీ నాయకుల పని అని తెలుపుతూ, చెరువుల కింద తూములు ముస్తూ వెంచర్లు వేయడం, బొందర గడ్డలను కబ్జా చేయడం సర్వేనెంబర్ 100 లో చాలా అక్రమాలకు జరుగుతున్నాయని ఆరోపించారు. అభివృద్ధిని మరిచి అన్యాయాన్ని పెంచి పోషిస్తున్నారని మక్తవాసులు దుర్గంధం వాసనలో నిత్యం ఇబ్బంది పడుతూ ఎన్నిసార్లు అధికారులకు ప్రజలకు మొరపెట్టుకున్న ఈ మాత్రం పక్కనున్న డంపింగ్ యార్డ్ గురించి పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవడం గద్దనెక్కడం ఆనవాయితీ అయిపోయిందని, ఇకపై మీ ఆటలు సాగనీయమని తెలుపుతూ శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగరవేయడం పక్క కబ్జాలకు అక్రమాలకు పాల్పడుతున్న వారి భరతం పట్టడం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు, నాగుల గౌడ్, గణేష్ ముదిరాజ్, రాజేష్ గౌడ్, శ్రీనివాస్, రాము, నరేష్, దినేష్, శివ, వినోద్ రావు, అనంతరెడ్డి పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here