మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్‌గౌడ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని నవభారత్‌నగర్‌లో ఎబిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముత్తూట్ ఫైనాన్స్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్యశిభిరానికి జగదీశ్వర్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిస్థితులు, ఆహారం కారణంగా అనేక రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. మనిషి జీవన శైలి ఆరోగ్యంపై అత్యంత ప్రభావం చూపెడుతుందని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కరోనా వ్యాధిని నివారించేందుకు ప్రతీ ఒక్కరూ మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బస్తి అధ్యక్షులు ఎం.డి సాదిక్, ఉపాధ్యక్షులు ఎం.డి షైక్ అలీ, ఎస్.కే కలీల్, జనరల్ సెక్రటరీ సయ్యద్ నూరుద్దీన్ హుస్సేన్, సభ్యులు బషీర్, చౌదరి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.