శేరిలింగంపల్లి లో ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్ గంగాధరరెడ్డి

గచ్చిబౌలి  డివిజన్ లో…
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రతిశక్తి కేంద్రం లో నిర్వహించిన బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ గంగాధర రెడ్డి హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో  డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్ గారు, ఎస్టి మోర్చా జిల్లా  అధ్యక్షుడు హనుమంతు నాయక్, జిల్లా ఓబిసి ఉపాధ్యక్షులు నీలం నరేందర్ కుమార్ ముదిరాజ్, ఏం స్వామి గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి రవీందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నీరుడి సురేష్ ముదిరాజ్, సంతోష్ సింగ్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్  , రాష్ట్ర ఎస్సీ మోర్చా ఐటి సెల్ కన్వీనర్ రాహుల్ ,  డివిజన్ ఉపాధ్యక్షులు అంబటి అశోక్, కుమ్మరి వెంకటేష్, గానుగు దయాకర్, తిరుపతి, కొమర గౌని  వెంకటేష్ గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి చెట్టి మహేందర్ గౌడ్, శ్రీనివాసాచారి , బీజేవైఎం డివిజన్ ప్రెసిడెంట్ ఎన్.శివకుమార్, ఐటీ సెల్ కన్వీనర్ రఘు కావూరి, మహిళా అధ్యక్షురాలు మహేశ్వరి, పూజ, వరలక్ష్మి , ఇంద్ర , ఎరుకల సతీష్, చేట్టి నరసింహ గౌడ్ , శివసింగ్, శ్యామ్ యాదవ్, నరేందర్ యాదవ్, బి ఈశ్వరయ్య, నరసింహ రాజు, శివ గౌడ్, అరుణ్ గౌడ్, కుమ్మరి ప్రవీణ్, కిషన్జీ , శ్రీనివాసరాజు, శ్రీ రాములు, పాల్గొన్నారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కసిరెడ్డి భాస్కరరెడ్డి

కొండాపూర్ డివిజన్ లో…
బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిఖ్ నగర్ లో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి హాజరై పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, రాజేందర్ రెడ్డి, రాము సదర్, ఆత్మారాం భైరాగీ, కిషన్ సుతార్, గెల్వయ్య తదితరులు పాల్గొన్నారు.

వేడుకల్లో పార్టీ జెండా ఎగురవేస్తున్న జ్ఞానేంద్ర ప్రసాద్

మియాపూర్ డివిజన్ లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ చౌరస్తా వద్ద డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొని కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బుచ్చిరెడ్డి, నాగుల్ గౌడ్, మణిక్ రావు, మహేష్ యాదవ్, రవి గౌడ్, బాబు రెడ్డి, విజేందర్, శివ, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here