పార్టీలు మారి మరి పోటీచేసిన, ఎన్ని బురద చల్లే మాటలు అన్న చివరికి తెలంగాణ రాష్ట్రంలో జరగిన సార్వత్రిక ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేసిన అభివృద్ధికే శేరిలింగంపల్లి ప్రజలు పట్టం కట్టారు. 47 వేల పై చిలుకు ఓట్లు వేసి గెలిపించారని హఫీజ్ పేట్ డివిజన్ 109 డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తెలిపారు.
హఫీజ్ పేట్ 109 డివిజన్ లో సైతం సుమారు 2500 ఓట్ల మెజారిటీ వచ్చిందని చెప్పారు. 30 రోజులు అహర్నిషలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇలానే కలిసికట్టుగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో హఫీజ్పేట్ ను అభివృద్దిలోకి తీసుకెళ్తామని పిలుపునిచ్చారు.