కష్టపడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు : బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : మసీద్ బండ కొండాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు పై వచ్చిన ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మహేశ్వరం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్ హాజరయ్యారు.

ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కొిండా విశ్వేశ్వర్ రెడ్డి

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, కష్టపడి పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్ అధ్యక్షులకు, వివిధ మోర్చా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం పక్క అనుకునే సమయంలో కొన్ని తప్పిదాల వల్ల, కొంతమంది సరైన రీతిలో పనిచేయకపోవడం వల్ల, బూత్ స్థాయి ఫుల్ మేనేజ్ మెంట్ లో సరైన ప్రచారం చేయక ఓట్లు అనుకున్న స్థాయి రాలేదని బంగపడ్డారు. అధిష్టానం కూడా సీటు కేటాయించడంలో కాలయాపన చేయడం కూడా పార్టీ గెలుపునకు పెద్ద మైనస్ అని తెలిపారు.


ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకు అండదండగా ఉంటుందని రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధించే దిశగా అందరూ పని చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here