కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వ పథకాలను (ఆయుష్మాన్ భారత్, ముద్ర యోజన, సుకన్య సమృద్ధి యోజన) ప్రజలు సద్వినియోగం చేసుకునేలా బీజేపి నాయకులు కృషి చేయాలని బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో మాట్లాడుతున్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టెలికాంనగర్ లో 375, 376 బూత్ ల శక్తి కేంద్ర ఇంచార్జీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యక్అతిథులుగా వారు హాజరై, పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్ర రావు, గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవెర్దన్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా అర్బన్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు విట్టల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ , ఆర్ వెంకటేష్ , దయాకర్, సీనియర్ నాయకులు స్వామి గౌడ్, సంజీవ్, దినేష్ యాదవ్, విశ్వనాథ, మురళి, బాలు, రాఘవేంద్ర, జగదీష్ రెడ్డి, టెలికాంనగర్ కాలనీ వాసులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన నాయకులూ, కార్యకర్తలు, ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here