సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ విఫలం : కసిరెడ్డి భాస్కరరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: సమస్యలను పరిష్కరించడంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే పూర్తి వైఫల్యం చెందారని బిజెపి రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ అద్యక్షుడు గొల్లపల్లి రాంరెడ్డి అధ్యక్షతన సోమవారం రాత్రి జరిగిన గౌతమీనగర్ శక్తికేంద్ర ప్రజాగోస – బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ లో పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆస్తులను అధికార పార్టీ నాయకులు గద్దల్లా తన్నుకుపోతున్నారని, ప్రజాకోర్టులో దోషులుగా నిలబెడ్తామని తీవ్రంగా హెచ్చరించారు.

బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతున్న కసిరెడ్డి భాస్కరరెడ్డి

మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధూరెడ్డి, సీనియర్ నాయకులు ఎలబద్రి శివరాజయ్య మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా మోసం చేసిన అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. శేరిలింగంపల్లిలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉందన్నారు. ఈ సమావేశంలో శక్తికేంద్ర ఇంచార్జి కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, బూతు అధ్యక్షులు వనమా శ్రీనివాస్, గూడూరి త్రినాథ్, రాంచంద్రారెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శులు శివకుమార్ వర్మ, శ్రీనివాస్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు పగడాల వేణుగోపాల్, డివిజన్ మహిళామోర్చా అధ్యక్షురాలు శోభాదూబే, మైనార్టీ మోర్చా జిల్లా నాయకులు గౌస్, నిషాత్, డివిజన్ కార్యదర్శి లలితతో పాటు నార్త్ ఇండియన్ సెల్ జిల్లా కన్వీనర్ రాజ్ జైశ్వాల్, నందనం విష్ణుదత్త్, ఆంజనేయులు, సీతారాం నాయక్, పాండుగౌడ్, డాక్టర్ రాంచంద్రారెడ్డి, కిషన్ నాయక్, కన్నారావ్, నర్సింహ, రామస్వామి, రాజేందర్ రెడ్డి, అర్జున్, మురళి, సాయిమురళి, శివరత్నాకర్, వంశీధర్ రెడ్డి, డాక్టర్ సత్యరమేష్, సంజీవరెడ్డి, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, వేణుమాధవ్, గాల్ రెడ్డి, సులోచన, రవీందర్ రెడ్డి, బిజెపి నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన నాయకులూ, కార్యకర్తలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here