నమస్తే శేరిలింగంపల్లి: భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ప్రజల నుంచి వచ్చిన వినతి మెరకు భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని, తన దృష్టికి వచ్చిన ఏ చిన్న సమస్య అయినా తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డీఈ ప్రవీణ్, ఏఈ ప్రసాద్, వాటర్ వర్క్స్ మేనేజర్ సాయిచరిత, వర్క్ ఇన్ స్పెక్టర్లు రఘు, నవీన్, లింగయ్య పాల్గొన్నారు.
