ప్రధాని మోడీకి చిత్రపటానికి క్షీరాభిషేకం

  • ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయంకు వెళ్లిన బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకడానికి బేగంపేట విమానాశ్రయంకు భారీ ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలతో బయలుదేరారు బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. అంతకుముందు నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1999 మూత పడిన ఎరువుల ఫ్యాక్టరిని ఆత్మనిర్భర్ లో భాగంగా 2015లో రూ. 6120 కోట్లు వెచ్చించి పునరుద్దరణ పనులను ప్రారంభించి 2021 ఫిబ్రవరి 28లో పూర్తిచేసి.. నేడు ఆ ఫ్యాక్టరిని దేశానికి అంకితం ఇవ్వడానికి తెలంగాణ వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ కి ఘన స్వాగతం పలికేందుకు వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఎరువుల ఫ్యాక్టరీ వల్ల మన తెలంగాణ ప్రజలకు రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని , దాదాపు 5000 ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులలో సగం తెలంగాణకే దక్కనున్నదని, రూ. 3700ల యూరియా బస్తా 94% సబ్సిడీతో 200లకే లభిస్తుందని, రూ. 1000 కోట్లతో భద్రాచలం రోడ్డు సత్తుపల్లి రైలు మార్గం జాతికి అంకితం చేయటం, 2200 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయటం గొప్ప పనులు చేస్తుంటే.. స్వాగతం పలకాల్సిన కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళటం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, మాదాపూర్ కంటెస్టడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, లింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, కొండాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్, సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, రమేష్, హనుమంతు నాయక్, వరలక్ష్మి, ఇందిరా, సుశీల, సరోజ పాల్గొన్నారు.

ప్రధాని మోడీకి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here