- రూ. 53 కోట్ల నిధులు కేటాయింపు..
- ప్రధాని మోడీ, కేంద్రమంత్రి కిషెన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రెండు స్టేషన్లకు (హఫీజ్ పెట్, హైటెక్ సిటీ) అమృత్ భారత్ స్టేషన్లుగా రూ. 53 కోట్లు నిధులు అభివృద్ధి పనులకు కేటాయించిన ప్రధాన మంత్రి మోడీకి, కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హఫీజ్ పెట్, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లను “అమృత్ భారత్ స్టేషన్లు” గా ఎంపిక చేసి రూ. 53.2 కోట్లతో మోడర్ నైజ్ చేయనున్నట్లు, ఈ పనులకు 6న ఢిల్లీ నుండి ప్రధాని మోడీ వర్చువల్ శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారని చెప్పారు. మోడర్ నైజేషన్ లో భాగంగా స్టేషన్ స్వచ్ఛత, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచడం, ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్, ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించే వ్యవస్థలు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ లు, స్టేషన్ ముందు, వెనక భాగంలో చిన్న గార్డెన్లు ఏర్పాటు చేస్తారన్నారు.