నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో బండి రమేష్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బస్సు పాసుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, ప్రధానోపాధ్యాయులు అరుణ, ఉప ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు బస్ పాసులు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ భావితరాల పౌరులైన విద్యార్థినీ విద్యార్థులకు బస్సు పాసులు ఇవ్వటం, చదువులో ప్రోత్సహించటం, తదితర సేవ కార్యక్రమాలు చేపడుతున్న బండి రమేష్ ని అభినందించారు. ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మాట్లాడుతూ బండి రమేష్ సేవా సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఇదేవిదంగా సహాయ సహకారాలు అందిస్తూ పేద విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బండి రమేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాలసీ ప్రకారం విద్య కోసం అనేక గొప్ప కార్యక్రమాలు చేపట్టారాణి పేర్కొన్నారు. అందులో ప్రధానమైనది కేజీ టు పీజీ, బడిబాట, గురుకుల పాఠశాలలు స్థాపన, పేదలకు స్కాలర్షిప్ అందజేస్తున్నారని తెలిపారు.