నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ హిల్స్, దర్గా గోరెంకా బస్తీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై కాలనీ వాసులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాదయాత్ర చేసారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రశాంత్ హిల్స్ , దర్గా గోరెంకా బస్తీలో కాలనీ వాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు కాలనీలలో పాదయాత్ర చేశానని తెలిపారు. సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రశాంత్ హిల్స్ కాలనీ లో నెలకొన్న ఔట్ లెట్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, నెలకొన్న డ్రైనేజి సమస్యను పరిష్కరిస్తామని, రోడ్లను పునరుద్దరిస్తామని, పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయం సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్, శ్రీకాంత్ , సత్యనారాయణ, ఉదయ్, అశోక్, వసీం, ప్రవీణ్ , సాయి గౌడ్ , ప్రశాంత్ హిల్స్ కాలనీ వాసులు జగదీష్, అశోక్ రెడ్డి, ప్రసాద్, ప్రభాకర్ రావు, శ్యామ్ ప్రభాకర్ రావు పాల్గొన్నారు.