కమిటీ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలి : ప్రభుత్వ విప్ అరెకపూడి పూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పునర్నిర్మాణం చేసిన కమిటీ హాల్ ను ప్రభుత్వ విప్ అరెకపూడిపూడి గాంధీ , శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని పూలబొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కమిటీ హాల్ ను కాలనీ సంబంధిత సమావేశాలు, అధికారిక సమావేశాలు, సమీక్ష సమావేశాలు నిర్వహించుకోడానికి సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తానని, దీనికి డివిజన్ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత రత్న అసోసియేషన్ ప్రెసిడెంట్ నరసింహ రావు, యూత్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ శివ శంకర్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ కేఎన్పి రావు, ప్రకాష్, నాగార్జున, ప్రభాకర్, గోపాల్ యాదవ్ కాలనీవాసులు పాల్గొన్నారు.

హౌసింగ్ బోర్డ్ కాలనీ కమిటీ సభ్యులతో ప్రభుత్వ విప్ అరెకపూడిపూడి గాంధీ , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here