నమస్తే శేరిలింగంపల్లి : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని “బ్యాక్ టు ది రూట్స్” అనే థీమ్‌తో మెడికవర్ హాస్పిటల్స్ శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించింది. ఆహారపు అలవాట్లు, నిత్యం వ్యాయామం చేస్తే కలిగే ప్రయోజనాలను వివరించింది ఆ హాస్పిటల్ బృందం. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ & సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. “ఆధునిక వైద్యంలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, అయితే ఆరోగ్యంగా ఉండేందుకు సహజసిద్ధమైన నివారణ, సాధారణ జీవనశైలి మార్పులపై ఆధారపడిన మన పూర్వీకుల నుంచి చాలా నేర్చుకోవచ్చని తెలిపారు. ఇందులో భాగంగానే ‘‘బ్యాక్ టు ద రూట్స్’’ అనే థీమ్ తో ముందుకు వచ్చామని, ఇది ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అవ్వడానికి, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాత పద్ధతులను అవలంబించేందుకు దోహద పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో పేషెంట్స్ , మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్స్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
