నమస్తే శేరిలింగంపల్లి: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం లో భాగంగా గురువారం మునుగోడు మండలంలోని కొండాపురం గ్రామం ఇంచార్జ్, శాసన సభ్యుడు పట్నం నరేందర్ రెడ్డి, పులిమేల గ్రామం ఇంచార్జ్ శాసన సభ్యుడు కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెరాస పార్టీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు రౌతు మోహన్ రావు, అక్బర్ ఖాన్, అంజద్ పాషా పాల్గొన్నారు.