నమస్తే శేరిలింగంపల్లి : మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్‌లోని శక్తి పీఠాలలో ఒకటైన తుల్జా భవానీ ఆలయంలో అమ్మవారిని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లి పూజలు చేశారు. ప్రజలు సుఖ శాంతులతో.. ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా దీవించాలని వేడుకున్నారు.