అక్షరాల లక్ష.. ఉపాధ్యాయులు కట్టాలా..

  • వేముకుంట ప్రభుత్వ పాఠశాలకు మోయలేని భారం
  • రూ. 1లక్ష నీటి బిల్లు విధించిన ప్రభుత్వం
  • వేమన వీకర్ సెక్షన్ ప్రభుత్వ పాఠశాలకు రూ. 15 వేలు
  • 20 వేల ఉచిత నీటి పథకం హామీ మరచిన సర్కార్
  • ప్రభుత్య పాఠశాలలకు నీటి బిల్లు పై సర్వత్రా ఆందోళన
  • వేముకుంట ప్రభుత్వ పాఠశాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
వేముకుంట, వేమన వీకర్ సెక్షన్ ప్రభుత్య పాఠశాలలకు ప్రభుత్వం విధించిన తాగునీటి బిల్లులు

నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం తాగునీటి బిల్లులు విధించడం దారుణమని, ఆ బిల్లులను ఉపాధ్యాయుల జీతం నుండి కట్టాలా అని మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లోని వేముకుంట ఉర్దూ, తెలుగు ప్రభుత్వ పాఠశాలలను పేరెంట్స్ కమిటీ ఫిర్యాదు మేరకు హాజరై సమస్యలను తెలుకున్నారు. వేముకుంట ప్రభుత్వ పాఠశాలకు లక్ష రూపాయలు, వేమన వీకర్ సెక్షన్ ప్రభుత్వ పాఠశాలకు రూ. 15 వేల తాగునీరు బిల్లు వచ్చిందని పేరెంట్స్ కమిటీ, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వమే తాగు నీటి బిల్లులను విధించటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ తరుపున డిమాండ్ చేస్తున్నామని, లేకుంటే ఉపాధ్యాయులు, పేరెంట్స్ తో కలిసి బిల్లు ఉపసంహరించే వరకు పోరాటం చేస్తామని బొబ్బ నవతారెడ్డి హెచ్చరించారు.

ప్రభుత్య పాఠశాలలకు సందర్శించి సమస్యలు తెలుసుకుంటున్న మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here