- ఘనంగా ఆరంభ టౌన్షిప్ లో అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని ఆరంభ టౌన్షిప్ లో నూతనంగా ఎంపికైన అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని వారిని శాలువా, గజమాల వేసి సత్కరించారు. ప్రెసిడెంట్ గా రవీంద్ర రాథోడ్, జనరల్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా రామ భూపాల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గా వెంకటేష్, జాయింట్ ట్రెజరర్ గా రెహానా బేగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా రాజేష్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన వారికీ గెలుపు, ఓటములు సహజమేనని, అందరు ఏకమై పార్టీలకతీతంగా కలిసికట్టుగా పనిచేసి, అభివృద్ధిలో పాలుపంచుకోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా టౌన్షిప్ లో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణశ్రీ, విజయ చౌహన్, దాసరి సరిత, ఉషారాణి, నయీముద్దీన్, విక్రమ్ యాదవ్, కుటుంబరావు, మహేష్, జనార్దన్, దాసరి నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, సురేష్ నాయక్, రవీంద్ర, నజీమ్, సాయిరాం, ప్రవీణ్ కుమార్, విజయ్, శ్రీనివాస్, మదర్, యోగేష్, షఫీ, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సందయనగర్ కాలనీ అధ్యక్షులు బస్వరాజ్ లింగాయత్, ఆరంభ టౌన్షిప్ కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.