- ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీని కలిసి సిద్దిక్ నగర్ వాసి కిషోర్ గుప్త
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ వాస్తవ్యుడు కిషోర్ గుప్త హైదరాబాద్ నుండి శబరిమలై వరకు కాలినడకన పాదయాత్ర చేసి, శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి హైదరాబాద్ కి వచ్చిన సందర్భంగా.. ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి యాత్ర విశేషాలు తెలిపి అయ్యప్ప స్వామి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ కాలినడకన వెళ్లి శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడం అభినందనీయమని కొనియాడారు. స్వామి కృప పొందడం గొప్ప విషయమని, ఎంతో మందికి ఆదర్శ ప్రాయలుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు గంప సత్యనారాయణ గుప్త, పబ్బా మల్లేష్, పబ్బా శ్రీనివాస్ , పశుపతి శ్రీనివాస్, నటరాజ్ గుప్త, సంపత్ గుప్త భరత్ గుప్త పాల్గొన్నారు.