నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్ల హుడా 11 కెవి ఫీడర్, లేక్ వ్యూ ఫీడర్ ల పరిధిలో పలు సాంకేతిక కారణాల వల్ల బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు తారానగర్ ఆపరేషన్స్ ఏఈ ఓ ప్రకటనలో తెలిపారు. నల్లగండ్ల ఫీడర్ పరిధిలోని నల్లగండ్ల హుడా, రత్నదీప్ వెనుక ప్రాంతం, హుడా వాటర్ ట్యాంక్ ఏరియా తదితర ప్రాంతాల్లో ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు, లేక్ వ్యూ ఫీడర్ పరిధిలోని కెకె గ్రిల్ ఏరియా, లేక్ వ్యూ, సిటిజన్ హాస్పిటల్, సాయి రాఘవేంద్ర అపార్ట్‌మెంట్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గం.ల నుండి సా. 5గం.ల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఈ అసౌకర్యానికి స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.