నమస్తే శేరిలింగంపల్లి: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్.వి.రమణను శేరిలింగంపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్‌భవన్‌లో జస్టిస్ రమణను కలిసిన గాంధీ పుష్పగుచ్ఛంతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలుగువాడైన ఎన్.వి.రమణ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు. ఆయన పర్యవేక్షణలో న్యాయవ్యవస్థ నూతన సంస్కరణలతో ప్రతిఒక్కరికీ సత్వర న్యాయం జరిగేలా అభివృద్ది జరగాలని అభిలషిస్తున్నట్లు తెలిపారు.
