అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించండి

  • తాళం వేసిన, నిర్మానుష్య ప్రాంతాల్లో మియాపూర్ పోలీసుల తనిఖీలు
తాళం వేసిన ఇంటి వద్ద తనిఖీలు చేపడుతున్న మియాపూర్ పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి: సంక్రాతి పండుగ నేపథ్యంలో వరుస సెలవుల సందర్బంగా ప్రజలు ఊర్లకు వెళ్తుండగా.. తాళం వేసిన ఇండ్లతో పాటు నిర్మానుష్య ప్రాంతాల్లో మియాపూర్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. నేరాలు, దొంగతనాలు జరుగకుండా చర్యలు చేపడుతున్నారు.

తాళం వేసిన ఇంటి వద్ద తనిఖీలు చేపడుతున్న మియాపూర్ పోలీసులు

ఎఫ్‌ఆర్‌ఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ల సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు దొంగతనాలు చేసే వారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి చేతి ముద్రలు తీసుకుని వివరాలు తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని మియాపూర్ ఇన్ స్పెక్టర్ తిరుపతి రావు ప్రజలకు సూచించారు.

రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here