నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండకి చెందిన మహేష్ కి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా రూ. 80 వేలు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబందించిన సిఎంఆర్ఎఫ్ ఎల్ఓసి మంజూరి పత్రంను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి బాధిత కుటుంబానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందచేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం నిరుపేదలకు సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు చంద్రమోహన్ సాగర్, సంపత్ పాల్గొన్నారు.