నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ లో పత్రిక నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో రూ. 5,00,000/- రూపాయల అంచనావ్యయం తో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాలను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే రోజులలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మరిన్ని కాలనీలలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చేయాలన్నారు.
పత్రిక నగర్ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీపార్క్ ను అన్ని రంగాలలో సుందరీకరించి, అన్ని హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని చెప్పారు. పత్రిక నగర్ పచ్చని చెట్లతో విరాజిల్లాలని, హైటెక్ సిటీకి వెనక భాగంలో ఉన్న పత్రిక నగర్ కు చాలా ప్రాధాన్యత ఉందని ఆ ప్రాధాన్యతలో భాగంగా పత్రిక నగర్ లో పార్కుల్లో పచ్చని చెట్లు కనిపించాలని దానికి పత్రిక నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు డిఈ రమేష్, టౌన్ ప్లానింగ్ ఏసిపి మెహ్రా, టిపిఎస్ విశాల్, ఏ ఎం ఓ హెచ్ నగేష్ నాయక్, స్ట్రీట్ లైట్స్ ఈ ఈ మల్లికార్జున రావు, ఏ ఈ రాజశేఖర్, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, తిరుపతి, శ్రవణ్ యాదవ్ , రాజు యాదవ్, అశోక్ సాగర్, సాయి, శివ పత్రిక నగర్ కాలనీ వాసులు శ్రీనివాస్ రావు, రామకోటయ్య, అనజనేయులు, సుధాకర్, నాగేశ్వరరావు, రవి కుమార్, రాజేంద్రప్రసాద్, రమేష్, మురళి, చంద్రకాంత్,హేమ సుందర్, సురేష్ బాబు, రమాకాంత్, రమేష్ రెడ్డి, కృష్ణ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.

కాలనీ వాసులను ఉద్దేశించి సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ