సబండ వర్గాల సంక్షేమ బడ్జెట్ : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • నమస్తే శేరిలింగంపల్లి: నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముఖ్య మంత్రి కేసీఆర్ దిషానిర్ధేశనతో రచించిన ఈ వార్షిక 2023-24 బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టిన తీరు అభినందనీయమని, సంక్షేమానికి పెద్ద పీట వేశారని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమ, జన రంజక బడ్జెట్ అని తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుందని హర్షం వ్యక్తం చేస్తూ.. బడ్జెట్ ను స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా రూ.2,90,396 కోట్ల వ్యయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించడం ఉద్యమ నేతకే సాధ్యమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎనిమిదిన్నరేండ్ల స్వల్పకాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నదని, ప్రజాసంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. “తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది” అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో భాగంగా 2023- 24 ఆర్ధిక సంవత్సర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ బడ్జెట్ 2023-2024

  • రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 37, 525 కోట్లు
    వ్యవసాయానికి కేటాయింపులు: రూ. 26,831 కోట్లు
  • నీటి పారుదల రూ. 26,885 కోట్లు
  • విద్యుత్ కేటాయింపులు రూ. 12,727 కోట్లు
  • ప్రజా పంపిణీ వ్యవస్థ రూ. 3117 కోట్లు
  • ఆసరా ఫించన్ల కోసం రూ. 12,000 కోట్లు
  • దళిత బంధు కోసం రూ. 17,700 కోట్లు
    ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం. రూ.15, 233 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 6, 229 కోట్లు
    మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
  • అటవీ శాఖ కోసం రూ. 1, 471 కోట్లు
  • విద్య కోసం రూ.19, 093 కోట్లు
  • వైద్యం కోసం రూ.12,161 కోట్లు
  • ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు.
  • గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు.
  • కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు.
  • షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
  • పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు.
  • రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు.
  • హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు.
  • పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు.
  • రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు.
  • హోంశాఖకు రూ.9,599 కోట్లు.
  • రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు.
  • రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు.
  • కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు కేటాయించారు.
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here